సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో నేడు, శనివారం సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి నేపథ్యంలో స్థానిక బస్సు స్టాండ్ రోడ్డు లో కృష్ణ విగ్రహాలకు పుష్పమాలలు వేసి అభిమానులు రాజకీయ ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. ఏలూరు ఎంపీ గా గతం లో ఆయన ఈప్రాంత ప్రజలకు చేసిన సేవలు కొనియాడారు. నేటి మధ్యాహ్నం స్థానిక కుబేర్ పంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కృష్ణ వర్ధంతి సభలో ప్రముఖ సీనియర్ హీరో సుమన్ ను ఘనంగా సన్మానించారు. ప్రముఖ సినీ నిర్మాత, ఏలూరు మేజి ఎమ్మెల్యే అంబికా కృష్ణ అంబికా కృష్ణ, ఉషా బాలకృష్ణ అతిధులుగా పాల్గొన్నారు. సుమన్ తనకు కృష్ణ గారి అభిమానులు చేస్తున్న సత్కారం తన అదృష్టంగా భావిస్తున్నానని, తాను ఎంతో అభిమానించే కృష్ణ గారు మన మధ్య లేకపోయిన ఆయన మంచి తనం, ఆయన సేవలు , పాన్ ఇండియా స్థాయిలో ఆయన సృష్టించిన సాహసోపేతమైన చరిత్ర, కృష్ణ గారి అంతులేని స్టార్ డమ్ చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన అభిమానుల రూపంలో ఇంకా జీవిస్తూనే ఉండటం ఎవరికీ సాధ్యం అవుతుందని ?తెగించి పోరాడే తత్వం..బహుభాషా భారీ బడ్జెట్ సినిమాలు, నిర్మాణాలు, రాజకీయాలు,మంచితనానికి, దాన గుణానికి పరాకాష్ట.. నిజ జీవితంలో హీరోలా బ్రతికిన ఇన్ని పార్శాలు ఉన్నఆయనతో కలసి నటించే అదృష్టం తనకు కలిగినందుకు అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *