సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మంతెన రామచంద్ర రాజు ఆధ్వర్యంలో కార్తీక మాసం నేపథ్యంలో భీమవరం ప్రకృతి ఆశ్రమం తోటలో కులాలకు అతీతంగా హిందూ వనవిహార్ ని ఘనంగా నిర్వహించారు. విశేషంగా ప్రజలు కుటుంబసమేతంగా హాజరు అయ్యి నిజంగా చిట్టడవి ని తలపించే ప్రకృతి చెట్ల క్రింద వన భోజనాలు స్వీకరించి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హాజరు అయ్యి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి హిందూ సాంప్రదాయ కార్యక్రమాలు ఆటపాటలు, భోజనాలు ప్రారంభించారు.
