సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దీక్ష తీసుకొన్న వందలాది మాలదీక్షదారులచే ఇరుముడి, పూర్ణాహుతి,దీక్షవిరమణ కార్యక్రమం నేడు, ఆదివారం ఉదయం నుండి ఆలయ ఆవరణలో ఘనంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు కలశస్థాపన పూజ జరిపిన అనంతరం మంగళ వాయిధ్యాలు నడుమ శ్రీ అమ్మవారి సన్నిధిలో విశేష అర్చనలు జరిపిన పూర్ణాహుతికి చెందిన విశిష్ట ద్రవ్యాలను ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శిరస్సు ఫై .. ప్రధాన అర్చకులు పెట్టగానే.. పెద్ద ఎత్తున వచ్చిన.. భక్తులు జై శ్రీ మావుళ్ళమ్మ అని అమ్మవారు నామ స్మరణతో భారీ యజ్ఞ గుండంలో పూర్ణహుతి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. తదనంతరం. ఇరుముడి ధరించిన మాలధారణ భక్తులు.. శ్రీ అమ్మవారు దర్శనం చేసుకొని.. అక్కడ నుండి పొట్టి శ్రీరాములు జంక్షన్.. ఆంధ్రాబ్యాంక్ రోడ్ నుండి తాలూకా ఆఫీస్ . శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం రోడ్ మీదుగా ముమ్మారు ప్రదక్షిణ చేసి.. తిరిగి దేవస్థానం కి చేరారు..అనంతరం మండల దీక్ష దారులకు మరియు భక్తులకు సుమారు మూడు వేలమందికి అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం నెయ్యాభిషేకం నిర్వహించి.. మాలధారణ భక్తులుకు అభిషేకం నెయ్యి వేసిన చిన్న డబ్బా..లడ్డు ప్రసాదం ఉచితంగా ప్రధాన అర్చకులు అందచేశారు.. మాలధారణ భక్తులు తో పాటుగా కార్తీక మాసం చివరి రోజులు అవడంతో.. వేలాది సంఖ్యలో దూర ప్రాంతాల నుండి భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చి దర్శనం చేసుకొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *