సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చివరి కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి లో వేంచేసియున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానములో నేడు, 27వ రోజు ఈ కార్తీక మాస సీజన్ లో రికార్డు స్థాయిలో శ్రీ స్వామివారి దర్శనార్థం సుమారుగా 25 వేల మందిభక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ సిబ్బంది పరిస్థితిని ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. . ఈరోజు దర్శనం అభిషేకం టికెట్స్ ద్వారా రూ 7, 59,900 /-ఆదాయం వచ్చి ఉన్నది .మరియు లడ్డు ప్రసాదం వలన రూ 46,000/- వేల రూపాయలు ఆదాయం వచ్చిది. మొత్తం రూ8,05,900/- ఆదాయం వచ్చిందని, దేవాలయ ఆవరణలో వేలాది భక్తులకు నిర్వహించిన అన్నసమారాధన నేపథ్యంలో శ్రీ స్వామివారి నిత్యాన్నదానం ట్రస్ట్ కు భక్తులు సమర్పించిన కానుకల వలన రూ1,26, 660/- రూపాయలు ఆదాయం వచ్చిందని దేవాలయ కార్యనిర్వహణాధికారి డి కృష్ణంరాజు తెలిపారు. నేటి సాయంత్రం స్వామివారి కార్తికజోత్యుల అలంకారం ఫై చిత్రంలో..
