సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, సోమవారం ఉదయం భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీహార్ లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి 202 స్థానాలలో భారీ ఘనవిజయం సాధించడం పట్ల హర్షం ప్రకటించారు.ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చేసిందని అన్నారు. బీహార్ లో రాజకీయపార్టీగా పోటీ చేసి ఒక్క స్తానం కూడా సాధించలేని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు బరిలో దిగితే రాజకీయాలు అంటే ఏమిటో తెలిసి వచ్చాయి అన్నారు. పొలిటికల్ ఎనలిస్టులు, సర్వేలు చేసేవారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవాలనుకుంటే రాజకీయాల్లో కుదరదని అన్నారు. .రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి పై నమ్మకం వల్లే సీఐఐ సమ్మిట్‌లో రూ. 13 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు.విశాఖపట్నం మొత్తం రూ. 3.53 లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులతో త్వరలో డేటా సెంటర్లకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీస్‌కు దేశంలోనే ప్రధాన కేంద్రంగా రూపుదిద్దు కోనుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. చెన్నయ్ నుండి నరసాపురం వరకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చే జనవరి 12 నుండి ప్రారంభం కానుందని ప్రకటించారు.
