సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని(Vaikuntha Dwara Darshan) డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) ఈ మూడు రోజులు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయబడ్డాయి. దర్శనం కేవలం లక్కీ డిప్ ద్వారానే అనుమతించబడుతుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకు 5,000 టోకెన్లను తిరుపతికి చెందిన స్థానికులకు కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
