సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నడిబొడ్డున స్థానిక 20వార్డు, ఇండియాన్ బ్యాంకు రోడ్డులో ( సిగ్మా ఆఫీస్ వద్ద) ఉన్న 150 ఏళ్ళ పైగా ఉన్న మహిమానిత శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో కార్తీక మహాశివరాత్రి నేపథ్యంలో గత మంగళవారం ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు 10 మంది వేద పండితులచే లక్షపత్రి పూజ, కుంకుమ పూజలు, గత రాత్రి శ్రీ స్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. తదుపరి అన్న సమారాధన నిర్వహించారు. గత రాత్రి ఆలయం స్థానిక భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమాలలో వందలాది భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
