సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం లో నేడు గురువారం ఆఖరి రోజు నేపథ్యంలో.. భీమవరంలో పంచా క్షేత్రం మొదలు అన్ని దేవాలయాలు భక్తులతో, మహిళల దీపారాధనలతో కార్తీక శోభను మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీకమాసం చివరి రోజు అయిన ఈ అమావాస్య నాడు భక్తులు కష్టాలు తొలగిపోయి..సిరి సంపదలు పొందాలి అన్న సంకల్పంతో.. విశేషమైన ‘చండీహోమం‘ దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 100మంది పైగా దమ్పతులు పాల్గొన్నారని, పరోక్ష పధ్ధతిలో కూడా.. మరి కొంతమంది పాల్గొన్నారు అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ( పైన తాజా చిత్రాలు)
