సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతుంది. ఏపీలో కాలం కానీ కాలంలో మరో తుపాన్‌ ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు శనివారం (నవంబర్‌ 22) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ వచ్చే సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉంది. ఆ తదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడనుంది. దీని ప్రభావంతో వరుసగా 3 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర , రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 42 50101ను ప్రభుత్వం విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *