సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు శనివారం దర్శించుకున్న భక్తులు శ్రీ అమ్మవారికి బంగారు కానుకలు అందజేశారు. వారిలో స్థానిక భక్తురాలు మానేపల్లి సత్యవతి అనే పెద్దావిడ సుమారు లక్ష రూపాయలు విలువచేసే 8 గ్రాముల బంగారం మరియు కత్తవపాడు కి చెందిన కే కొండలరావు సుమారు ఇరవై ఆయుదు వేలు రూపాయలు విలువ గల 2 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారిని పూర్తీ స్వర్ణ మాయం చెయ్యడానికి తమవంతు కానుకలుగా అందచేసారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ. మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వారికీ శేషవస్త్రం ప్రసాదాలు ఫోటో అందచేసారు. ఈ కార్యక్రమంలో శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం మాజీ చైర్మెన్, కారుమూరి సత్యనారాయణ మూర్తి పాల్గొన్నారు.
