సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల హైదెరాబాద్ రామోజీ అవార్డు పంక్షన్ లో కలిసిన గురు శిష్యులు తమ బంధాన్ని మరోసారి బహిరంగంగా చాటుకొన్నారు. ఒక ప్రక్క ఎన్డియే సీఎం, మరో ప్రక్క కాంగ్రెస్ పార్టీ సీఎం ఒకే వేదికపై వారం తిరగకుండా 2సార్లు ఉండటం దేశ చరిత్రలో అరుదయిన కలయికగానే చెప్పుకోవాలి. ఏపీలోని పుట్టపర్తి లో జరుగుతున్నా శ్రీ సత్యసాయి శతజయంతి ముగింపు ఉత్సవాలలో భాగంగా తాజగా జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు , తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇది తెలుగురాష్ట్రాల అనోన్యత ను చాటింది ఈ సందర్భంగా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మానవరూపంలో వెలసిన దేవుడు సత్యసాయి అని సీఎం చంద్రబాబు కీర్తించగా, ప్రేమ తో ఎవరినైనా జయించవచ్చు అని సత్య సాయి నిరూపించారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని కళ్లకుకట్టేలా కళారూపాలను ప్రదర్శించారు. ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
