సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలకతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా భీమవరంలో నూతనంగా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన తన క్యాంపు కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. నేడు, ఆదివారం భీమవరంలోని నరసయ్య అగ్రహారంలో నూతనంగా నిర్మించిన కేంద్ర సహాయమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి, నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పాందువ్వ శ్రీను తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపి మూర్తి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు పాల్గొనగా , రాజకీయాలకు దూరంగా ఉంటు, వచ్చే కొత్త ఏడాది బీజేపీ లో చేరతారు అని ప్రచారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, రావడం ఆయనకు మంత్రి శ్రీనివాస్ వర్మ కాషాయం శాలువ గౌరవపూర్వకంగా కప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలచింది.టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రామరాజు,రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, బీజేపీ మహిళా నేతలు ముళ్ళపూడి రేణుక, శ్రీదేవితో పాటు కూటమి ప్రముఖులు శ్రీనివాస వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.
