సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఆల్ వాకర్స్ అసోసియేషన్ (2026-28 సంవత్సరాలు) నూతన కార్యవర్గ సభ్యులను మంగళవారం మార్నింగ్ కాఫీ క్లబ్ అధ్వర్యంలో సత్కరించారు. అధ్యక్షులు భీమాల శ్రీరామూర్తి, కార్యదర్శి మెంటే పూర్ణచంద్రరావు, కోశాధికారి బొడ్డు ప్రసాద్ లను సత్కరించారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు,కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్, పిఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, మానేపల్లి రవి చిన్నారావు, కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయన్నారు. నడక పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ మూర్తి, కోట్ల నాని, తటవర్తి నారాయణ,చవ్వా శ్రీనివాస సుబ్బారావు, బంగారు ప్రసాద్, సంకా బాబు, గుండు సుమూర్తి, కురిశెట్టి కాశి, కంచర్ల భాస్కరరావు గుప్త,బాయ్స్ శ్రీనివాస్, బొండాడ బంగారాజు, కొల్లేపర్ల సుబ్బారావు, అల్ వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.
