సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఉంగుటూరు నియోజకవర్గములో డిసెంబరు 1న సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు అయ్యింది. ఆ రోజు వృద్దులకు పెన్షన్ల పంపిణీ, సభ ఏర్పాట్లపై అధికారం యంత్రాంగం చర్యలు చేపట్టింది. స్థానిక, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్, గన్ని వీరాంజనేయులు కలెక్టర్ తో కలసి, చేబ్రోలులో భారీ బహిరంగ సభ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు గొల్లగూడెంలో ప్రజలతో ముఖాముఖి, కార్యకర్తలతో సమావేశం నేపథ్యంలో, హెలిపాడ్ చేస్తున్నారు.
