సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:నేడు, బుధవారం పులివెందుల బ్రహ్మణపల్లిలో అరటి తోటలను పరిశీలించిన మాజీ సీఎం జగన్ అక్కడి రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడే కాదు.. ఏపీలో ఎక్కడ చుసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని.. ఇటీవల అరటి పంట రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని, కేజీ రూపాయికి కూడా కొనేవారు లేక రైతులు రోడ్లపై అరటికాయలు పోస్తున్నా దారుణ పరిస్థితి నెలకొందని, అన్నారు.‘మా హయాంలో అరటి పంట టన్ను రూ .30 వేలకు పలికింది. 3 లక్షల టన్నుల పంటను ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్ పోర్ట్ చేశాం . కరోనా టైం లోనూ ఎక్కడ తగ్గలేదు. అరటి ఎక్స్ పోర్ట్ కోసం అనంతపురం -ఢిల్లీ, తాడిపత్రి-ముంబైకి రైళ్లు నడిపాం. దేశంలోనే నెంబర్ 1గా, కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం . కానీ, ఇప్పుడు రైతులను పట్టించుకొనే ఊసే లేదు. టన్నురూ .2 వేలకు కూడా కొనేవాడు లేడు పంట చెట్టు మీదే మాగిపోతోంది. చంద్రబాబు గారి ఈ 17 నెలల కాలంలో 16 విపత్తు లొచ్చాయి.కానీ, రైతులకు కనీస సాయం కూడా అందలేదు. గతంలో మా హయాంలో సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వాళ్లం. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటిదాకా ఇన్పుట్ సబ్సిడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదు. అన్న దాత సుఖీభవ’ కింద ఈ 2ఏళ్లకు రూ .40వేలు ఇస్తామని.. రూ .10 వేలు కూడా ఇవ్వడం లేదు. ఆఖరికి రైతులు ఎరువులు సైతం బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిన పరిస్థితి నెలకొంది. లక్షల కోట్ల అప్పులు తెస్తున్నారు. ఏమి చేస్తున్నారో తెలియడం లేదు.. రాష్ట్రము అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది అని జగన్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *