సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంటుంది. గత ప్రభుత్వ హయంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నపటికీ వారు దిగిపోయే ముందు అంతో ఇంతో రోడ్డులు కొత్తవి వెయ్యడం, మరమత్తులు చెయ్యడం జరిగింది. అయితే కూటమి సర్కార్ వచ్చాక రోడ్డులు మరింత బాగుపడతాయని ఆశలు పెట్టుకొన్న ప్రజలకు గత 18 నెలలుగా నిరాశ ఎదురౌతుంది. అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర పెద్దలకు కీలక కేంద్రంగా వెలుగొందుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరంలో ఇటీవల వర్షాలకు, భారీ వాహనాల రాకపోకల నేపథ్యంలో రోడ్డులు తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి.మరో ప్రక్క కాంట్రాక్టర్స్ కు ఇవ్వవలసిన పాత బకాయిలు విడుదల కావడం లేదు.. భీమవరం పట్టణం నడిబొడ్డున వెళ్లే పి.పి రోడ్డు రహదారి సైతం ప్రధాన సెంటర్ లలో సైతం గుంతలు మరింత పెరిగాయి. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి.( భీమవరం 3 టౌన్ మాత్రం కేంద్ర మంత్రి వర్మ చొరవతో కొత్త రోడ్డులు వచ్చాయి) భీమవరం నుండి తాడేపల్లి గూడెం వైపు లోసరి వరకు రోడ్డు పరిస్థితి చెప్పనక్కరలేదు. ఇటీవల ఉండి వంతెన వద్ద భారీ వాహనాల రాకపోకలు సైతం నిలుపుదల చేస్తున్నారు. ఏలూరులో మొన్న జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జడ్పీ సర్వ సభ్య సమావేశంలో సైతం జిల్లాలో రహదారుల దుస్థితిపై జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, కొత్త రోడ్లకు ప్రభుత్వ నిధులు విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు.
