సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళలో ఉద్యోగాలు పొందిన వారికీ అపాయింట్మెంట్ లెటర్స్ ను కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, డిప్యూటి స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కలెక్టర్ చదలవాడ నాగరాణి అందించారు. కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో అనకాపల్లి రామాయపట్టణం ప్రాంతాల్లో ఏర్పాటు కాబోయే పరిశ్రమలల్లో 1లక్ష40 వేల ఉద్యోగాలకు అవకాశం ఉందని, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. భీమవరంలో ఈజాబ్ మేళాకు 2,600 మంది రిజిస్ట్రేషన్ అవ్వటం చాలా గొప్ప విషయమని, ఇటువంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాలో 600 పైగా ఉద్యోగాలు పొందారని, మరికొన్ని ఉద్యోగాలకు సెకండ్ ఇంటర్వ్యూ అనంతరం మరొక 400 మంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, డైరెక్టర్ డా జగపతి రాజు, ప్రిన్సిపల్ డా మురళీకృష్ణంరాజు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డా పి లోకమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *