సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లాలో పంట కాలువలు, మురికి కాలువలు పూర్తిగా పూడిపోయాయని, వాటిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, శనివారం కలెక్టరేట్ లో రబీ పంట కాలానికి నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. రబి పంటకు సంబంధించి రైతులకు ఎటువంటి సాగునీరు ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంట కాలవల్లో ధవలేశ్వరం నుండి ఉప్పుటేరులో నీరు కలిసే వరకు నీరు పూర్తిగా కలుషితం వల్ల ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. జిల్లాలో ఎక్కువ కుటుంబాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. జిల్లాలో అన్ని కాలువలు, డ్రైయిన్సు పూడికలు తొలగించి వెడల్పు చేయాలన్నారు.జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1 తేదీ నుండి దళ్వా సాగుకు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్ 15 నాటికి రబి పంట పూర్తిస్థాయిలో రైతుల చేతికి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్, మే మాసాలలో పంట కాలువలు, డ్రైయిన్స్ వార్షిక మరమత్తు పనులు పూర్తి చేయాలన్నారు. వచ్చే వేసవి నాటికి పట్టణ, గ్రామ స్థాయిలో ప్రజలకు త్రాగునీరు అందించేందుకు మంచినీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపేందుకు అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కె మురళీకృష్ణరాజు, వైస్ చైర్మన్ గుబ్బల మార్రాజు, డిఆర్ఓ బి శివన్నారాయణ రెడ్డి, డిపిఓ ఎం రామనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఇఇ యు రమేష్, ఏఇ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు
