సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ప్రచండంగా ఉన్న దిత్వా తుఫాన్ చాల నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం ఇది కారైకాల్(Karaikal)కు 80 కి.మీ., పుదుచ్చేరి(Puducherry)కి 160 కి.మీ., చెన్నై(Chennai)కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు గడచిన 6 గంటల్లో కేవలం 5 కి.మీ వేగంతో ఈ తుఫాను కదిలినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతుంది. దీంతో ఏపీలోని రెడ్ అలర్ట్ లో ఉన్న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నేటి ఆదివారం ఉదయం నుండి పశ్చిమ గోదావరి జిల్లా లో ముసురు కమ్ముకోగా నేటి మధ్యాహ్నం వంటిగంట నుండి భీమవరం పరిసర ప్రాంతాలలో తీవ్ర చలిగాలులతో ఒక మోస్తరు వర్షం కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి నెల్లూరు(Nellore) జిల్లా వ్యాప్తంగా వరుసగా 3వ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సముద్రంలో అలల ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పటికే మూడో నంబర్ ప్రమాద సూచికలు జారీ అయ్యాయి. జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు ఇప్పటికే నిండుకుండల్లా మారి పలు ప్రాంతాల్లో వరినార్లు నీటమునిగాయి.
