సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నేడు, సోమవారం తమ రాజీనామాలు ఆమోదించుకునేందుకు మండలి చైర్మన్ మోషేను రాజు ను కలసిన 6గురు వైసీపీ ఎమ్మెల్సీ లలో పునరాలోచనలు మొదలయ్యాయని తెలుస్తుంది. తాజగా వైసీపీ ఎమ్మెల్సీ జాకియా తన రాజీనామా ను ఉపసంహరించుకున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు స్వయంగా చైర్మన్‌ మోషేను రాజుకు జాకియా ఖానం వివరించారు. కాగా.. ఈ ఏడాది మేలో ఆమె తన ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి జాకియా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే 2020 జూలైలో ఎమ్మెల్సీగా జాకియాను గవర్నర్ నామినేట్ చేశారు. మైనారిటీలకు గౌరవం ఇస్తున్నట్లు ప్రకటించి ఆమెను సీఎం జగన్ మండలి వైస్ చైర్మెన్ గా నియమించారు. అయితే ఆమె విచిత్రంగా .. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన పదవులకు రాజీనామాచేసి బీజేపీ లోకి వెళ్ళడానికి మొగ్గు చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సుదీర్ఘ కాలం చైర్మెన్ మోషేను రాజు ఆమె రాజీనామా ను ఆమోదించకపోవడంతో ఆమె తిరిగి స్వంత వైసీపీ గూటికి చేరటానికి అవకాశం మిగిలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *