సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని తొలేరు గ్రామంలో చవాకుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత సోమవారం రాత్రి జరిగిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాటిక కళాపరిషత్ 21వ జాతీయ నాటిక పోటీల ముగింపు సభలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని నాటక కళకోసం పరితపిస్తున్న కళాకారులకు వారిని ప్రోత్సహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు కోట శంకర్ రావు కి, మరియు AP సాంస్కృతిక నాటక కళాపరిషత్ అధ్యక్షులు బుద్దాల వెంకట రామారావు కి గ్రామా ప్రజల సమక్షంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ MLC కవురు శ్రీనివాస్, టీచర్లు MLC బొర్రా గోపి మూర్తి లు పాల్గొని పలువురు సినీ నాటక రంగ కళాకారులును సన్మానించారు.
