సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం, వీరవాసరం మండలం, నందమూరుగరువు గ్రామంలో ప్రతిష్టాకరంగా జరిగే శ్రీశ్రీశ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు అంటే జిల్లాలో తెలియనివారు ఉండరు. శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి 60వ వార్షికోత్సవం మరింత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు నేటి బుధవారం నుండి స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామఆంజనేయులు , రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ మోషేను రాజు ప్రత్యేక పూజలు అనంతరం ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది 13 రోజులు పాటు భారీ సెట్టింగ్స్, లైటింగ్, భారీ ఎగ్జిబిషన్ లతో, నాటక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలలో మహిమానీత శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. నేడు ప్రారంభమైన వార్షిక ఉత్సవాల ను డిసెంబర్ 15వ తేదీ ఉదయం మహా అన్నసమారాధన తో ముగిస్తారు
