సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి మహిళలపై, యువతులపై అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజా వార్త సమాచారం ప్రకారం . ఏలూరులో తన స్నేహితురాలి ఇంటిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతిపై స్థానిక రౌడీ షీటర్స్ అమానుషం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న అర్ధరాత్రి వేళ.. ఇద్దరు రౌడీ షీటర్లు మద్యం సేవించి వారి ఇంటికి వెళ్లి తలుపులు, కిటీకీలు బాదుతూ వారిని ఇబ్బందులకు గురిచేశారు. ఇంతలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన యువతి తలుపులు తీసేందుకు వచ్చింది. ఇంతలో ఆమెను కొట్టుకుంటూ సమీపంలోని సచివాలయ భవనంలోకి ఈడ్చుకెళ్లాడో రౌడీషీటర్. అనంతరం ఆమెఫై అత్యాచారానికి పాల్పడి ఆమెను బెదిరించి వెళ్లినట్లు తెలుస్తోంది. మరల కొద్దీ సేపటికే ఆ ఇద్దరు రౌడీ షీటర్స్ తిరిగి వచ్చి. ఇద్దరు యువతులనూ ఇష్టానుసారంగా బెల్టుతో కొట్టి బెదిరించారు. దీనితో బాధిత యువతులు ఇద్దరూ స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తామంటే.. అక్కడి సిబ్బంది ఎవరూవారిని పట్టించుకోలేదని? ఆరోపించారు. అయితే ఈ విషయం వారు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిఆదేశాలతో కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాధిత యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *