సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం రిలీజ్ వాయిదా పడటం ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య అభిమానులు ను తీవ్రంగా నిరాశ పరచింది. గత గురువారం రాత్రి ప్రీమియర్ షోస్ పడాలి, నేడు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాలి. సినిమా హాళ్ల వద్ద అభిమానుల భారీ హంగామా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధర 600 రూపాయలు వరకు పెంచుకోవడానికి, ప్రీమియర్లకు అనుమతినిచ్చాయి. సీనియర్ అగ్రహీరోలలొ వెంకటేష్, చిరంజీవి ల తరువాత ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ లేని బాలయ్య ఈసారి అన్ని రెకార్డ్ ను అధిగమించాలి అని అభిమానుల ఆరాటం.. కానీ బాలయ్య కెరీర్ లో తొలిసారి సినిమా విడుదల ఆగిపోయింది. దీనికి కారణాలు చుస్తే.. అఖండ 2’ విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.. ‘అఖండ 2’కు డబ్బులు సమకూర్చిన ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలకు అడ్డు పడే అవకాశం ఉందని ముందు నుంచీ వార్తలొచ్చాయి. దాంతోపాటు ఈ సినిమా కోసం నిర్మాతలకు ఐవివై ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మరో ముగ్గురు ఫైనాన్స్ చేశారు. నిజానికి, అఖండ విషయంలో . 14 రీల్స్ ప్లస్, ఎరోస్ మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవట. కానీ గతంలో 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట (అనిల్ సుంకర మరో భాగస్వామి). మహేష్ బాబు ‘దూకుడు’ వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాల నిర్మాణంలో ఎరోస్‌తో ఆర్థిక లావాదేవీలు జరిగాయి.అక్కడి నుంచే గొడవలుకు బీజం పడింది. కానీ ‘సర్కారు వారి పాట’ విడుదల సమయంలో మౌనంగా ఉన్న ఎరోస్ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల మీద స్టేకోరింది. తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది.తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కొన్నేళ్ల క్రితం ఎరోస్ ట్రిబ్యునల్‌కు వెళ్లగా 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాని సవాల్ చేస్తూ 2020లో మద్రాస్ హైకోర్టుకు, 2021లో డివిజన్ బెంచ్, ఆగస్టు 2021లో సుప్రీమ్ కోర్టుకు 14 రీల్స్ వెళ్ళింది. కానీ ఒక్క రూపాయి కట్టలేదు. ఇప్పుడు ‘అఖండ 2’ విడుదలపై ఎరోస్ స్టే కోరగా. ’14 రీల్స్ ప్లస్’ సంస్థపై తీసిన సినిమా అని నిర్మాత కోర్టుకు తెలిపారు. అయితే… 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ వేర్వేరు కాదని, రెండు సంస్థలూ రామ్ ఆచంట, గోపి ఆచంట వే అని ప్రూవ్ చేయడంలో ఎరోస్ సక్సెస్ అయ్యింది. దాంతో 28 కోట్ల రూపాయలకు వడ్డీతో సహా (50 కోట్ల పైగా ?) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఏది ఏమైనా ఈ డిసెంబర్ నెలలోనే సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
