సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఇండిగో సంస్థ తమకు పైలట్స్ కొరత ఉందని? ఆకస్మికంగా భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుచేస్తుండటంతో ప్రయాణీకులు షెడ్యూలు ప్రకారం సమయానికి గమ్యాలు చేరలేక నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రయాణికులు డబ్బు రీఫండ్ విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితులపై, కేంద్ర విమానయాన శాఖ అసమర్థతగా ఏకిపారేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రయాణీకుల రీఫండ్‌లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. రద్దు చేయబడిన, అంతరాయం కలిగించిన అన్ని విమానాల టికెట్స్ చార్జీల రీఫండ్ ప్రక్రియను 2025 డిసెంబర్ 7 (ఆదివారం) రాత్రి 8:00 గంటలలోపు పూర్తి చేయాలని ఆదేశించింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ నియంత్రణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. చర్యల్లో భాగంగా ఇండిగో కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పదవి నుంచి తొలగించాలని? విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది. సందెట్లో సడేమియా అంటూ మిగతా సంస్థల విమానాల టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. ఇంటర్‌నేషనల్ సర్వీసుల కంటే నేషనల్ సర్వీసుల ధరలు డబుల్ అయ్యాయి.ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిన దారుణ పరిస్థితి.
