సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే స్థానిక క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహించిన గ్రీవెన్స్ లో భీమవరం నియోజక వర్గ ప్రజల నుంచి అర్జీలను ఎమ్మెల్యే అంజిబాబు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, పలు ప్రజా సమస్యలను పరిష్కరించిందన్నారు. నెలలో వచ్చిన అర్జీ మరొకసారి రాకుండా వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, నెలలో మొదటి శుక్రవారం, మూడో శుక్రవారం ప్రజల నుంచి నేరుగా సమస్యల అర్జీలను స్వీకరిస్తామని అన్నారు. చిన అమిరంలో 50 మందికి ఇచ్చిన పట్టాలను అన్ లైన్ చేయడం లేదని, లబ్ధిదారులు ఎమ్మెల్యే అంజిబాబును కోరడంతో దీనిపై హౌసింగ్ పిడి తో ఎమ్మెల్యే అంజిబాబు ఫోన్లు మాట్లాడి వెంటనే అర్హులైన లబ్ధిదారులకు ఆన్ లైన్ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారందరికీ అన్ని పథకాలను అందుతాయని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *