సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను ఈసారి భారీ అంచనాలతో రూపొందించిన.. అఖండ 2 సినిమా గత డిసెంబర్ 5న రిలీజ్ కు కొద్దీ గంటల ముందు వాయిదా పడటం అభిమానులను ఎంతగా నిరాశపరచిందో అందరికి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా విషయంలో.. విశ్వ సనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖండ 2 సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయడానికి పక్క ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 11వతారీఖున ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ పలుచోట్ల పడనున్నాయి. ఇప్పటికే సినీ ప్రముఖులు సమక్షంలో దాదాపు ఈ సినిమాకి సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. అయితే దీనిపై చిన్న సినిమా నిర్మాతలు హీరోలు గుర్రుగా ఉన్నారు, క్రిస్మస్ కానుకగా కూడా 5 సినిమాలు వరకు రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాల రిలీజ్ డేట్ లు మారుచుకోవాలి.. ఫిబ్రవరికి వెళ్లిపోవలసిందే. ఇక వెంకటేష్ కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి , ‘శివ శంకర్ వర ప్రసాద్’ సినిమా డబ్బింగ్ కూడా ఈవారంలో పూర్తీ చేస్తున్నారు. వచ్చేవారం నుండి ప్రమోషన్స్.. సంక్రాంతి కి సినిమా రిలీజ్ ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *