సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన ఆదేశాలను లెక్కచెయ్యని టీడీపీ ఎమ్మెల్యే లపై ఏపీ సీఎం నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు అని తాజా సమాచారం. . దేశంలో ఏ పార్టీ చేయని విధంగా సొంత ఎమ్మెల్యేలకే నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేకపోతే ఉన్నతాధికారులు నోటీసులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ తొలిసారిగా రాజకీయ పార్టీల్లో ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించడం ఇపుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. టీడీపీకి చెందిన 48 ఎమ్మెల్యేల పనితీరుపై, మరి కొందరి అవినీతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నిర్లక్యంతో పలు నియోజకవర్గాలలో ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది అని సీఎం చంద్రబాబు భావిస్తూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఈ ప్రజాప్రతినిధుల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే ద్వారా ఆయనకు సమాచారం అందినట్లు వార్త.. మరి 48 మంది ఎమ్మెల్యేల కి నోటీసులు,తదుపరి చర్యలు తప్పవని భావిస్తున్నారు.
