సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపికచేసిన గ్రామాల్లో రీ సర్వే ఇప్పటి వరకు మూడు విడుతలు పూర్తీ చేసారు. ఇక ఆఖరిది అయిన మిగి లిన 52 గ్రామాల్లో నాలుగో విడత సర్వేకు అధికారులు సిద్ధం అవుతున్నారు జనవరి 2వ తేదీ నుంచి సర్వే ప్రారంభం కానుంది. గ్రామాల ఎంపిక జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. దీనితో బ్యాంకుల్లో రుణాలు పొందడానికి, భూముల క్రయ విక్రయాలకు రైతులకు సులభంగా అభ్యన్తరాలు లేకుండా ఉంటుందని ప్రభుత్వ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఆయా గ్రామాలలో రైతులకు ముందే నోటీసుల ద్వారా రి సర్వే చేస్తున్నట్లు తెలియపరుస్తున్నారు. వారి నుంచి పత్రాలను సేకరించి రీ–సర్వేలో హద్దులతో సహా వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. రైతు అభ్యంతరం పెడితే వాటి పరిష్కారము సఫలం అయితేనే వాటిని నోట్ చేస్తున్నారు. రైతులు దస్తావేజుల ఆధారంగా హద్దులను నిర్ణయిస్తున్నారు.
