సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గమ్మ స్వయంగా వెలిశారని పురాణ ప్రాశస్యం ఉన్న, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్ష విరమణలు నేటి గురువారం ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామునుండి వేలాదిగా భవానీలు ఆలయ ప్రాంగణానికి చేరుకోవడంతో, హోమ గుండంలో అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు ప్రారంభమయ్యాయి. జై దుర్గా.. జై జై దుర్గా నామస్మరణతో ఇంద్ర కీలాద్రి ‘ఎర్రటి అరుణోదయం’తో మార్మోగుతోంది ఈకార్యక్రమంలో గా ఆలయ ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రాగాంధీ మరియు భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుండి ఈ నెల 15వ తేదీ వరకు నుంచి 5 రోజులపాటు ఈ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. భవానీ దీక్షా విరమణలుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండటం కోసం అధికారులు, దేవస్థానం ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
