సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి, పదార్‌పూర్‌లకు స్పెషల్ ట్రైన్స్ వెళ్లనున్నాయి. ఇక, ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ – కాకినాడ స్పెషల్ ట్రైన్ నెంబర్ 07196 హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కాకినాడ వరకు (భీమవరం TOWN తెల్లవారు జాము 3. 50 సమయానికి చేరుకొంటుంది)మీదుగా వెళ్లనుంది. డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. అది కూడా మంగళ, బుధవారాలు మాత్రమే ఈ స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. చర్లపల్లి నుంచి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కాకినాడ బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. 07195 నెంబర్ ట్రైన్ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు (రాత్రి 10.30 కి భీమవరం వస్తుంది) నడుస్తుంది. డిసెంబర్ 28వ తేదీనుంచి 31వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. అది కూడా ఆదివారం, బుధవారాల్లో మాత్రమే ట్రైన్ నడుస్తుంది. కాకినాడ నుంచి రాత్రి 7.50 గంటలకు చర్లపల్లి బయలు దేరుతుంది. మరుసటి ఉదయం 8.30 గంటలకు చర్లపల్లికి వెళుతుంది. హైదరాబాద్ – తిరుపతి స్పెషల్ ట్రైన్ నెంబర్ 07031 డిసెంబర్ 19వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ప్రతీ శుక్రవారం మాత్రమేఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *