సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరమని, పేద కుటుంబాలు వైద్యకోసం దరఖాస్తు చేసిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 28వ విడతలో 32 మంది లబ్ధిదారులకు రూ 19,23,755 ల చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఇప్పటి వరకు భీమవరంలో 427 మంది లబ్ధిదారులకు రూ 3,66,63,664 లు అందించామన్నారు. వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *