సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:టిడ్కో ఎండీ సునీల్‌ కుమార్‌ రెడ్డి భీమవరం, పాలకొల్లు తాడేపల్లిగూడెంలో నిర్మాణములో ఉన్న టిడ్కో గృహ నిర్మాణాలను , పూర్తీ చేసిన సముదాయాలను పరిశీలించారు. భీమవరానికి సంబంధించి టిడ్కో అపార్ట్మెంట్స్ లోఇంకా 6,368 ఇళ్లు నిర్మాణ పనులు పూర్తీ చెయ్యవలసిఉందని, వాటిని వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో పూర్తిచెయ్యాలని అధికారులను కాంట్రాక్టర్స్ ను ఆదేశించారు.ఎస్‌టీపీ నిర్మాణం పూర్తయితే 930 ఇళ్లకు సంబంధించి వాటిని లబ్దిదారులకు అప్పగించేందుకు ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. తెదేపల్లి గూడెంలో టిడ్కో గృహ నిర్మాణాలు చివరి అంకంలోకి చేరాయని,1164 గృహాలు పెండింగ్‌లో ఉన్నాయనివాటిని పూర్తిచేసి వచ్చే జనవరి నెల 15 లోగా అప్పగించాలని ఎల్‌అండ్‌టీ అధికారులను టిడ్కో ఎండీ సునీల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. పాలకొల్లుకు సంబందించి ఇంకా 3552 ఇళ్లను పూర్తీ చెయ్యవలసిఉందని వీటినికూడా మార్చినెలాఖరునాటికి పూర్తిచేసి లబ్దిదారులకు అప్పగించాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *