సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం చినరంగనిపాలెం లోని బేతెస్ద మినిస్ట్రీస్ లో క్రిస్మస్ సువార్త సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. ప్రేమ భావాన్ని, సేవతత్పరతను, క్షమాగుణాన్ని బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత ప్రీతికరమైన రోజని అన్నారు. సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలని, జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నారు. మినిస్ట్రీస్ పాస్టర్లకు రూ 12 లక్షల ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా ఇన్సూరెన్స్ బాండ్ లను అందించారు. కార్యక్రమంలో చర్చ్ పాస్టర్ రమేష్ బాబు, గుంటూరు పాస్టర్ మధ్యూస్ పాస్టర్లు, టీడీపీ నేతలు మామిడి శెట్టి, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు పాల్గొన్నారు.
