సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో జాతీయ లోక్అదాలత్ లో భాగంగా మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు, శనివారం సంస్థ అధ్యక్షులు, 3వ అదనపు జిల్లా జడ్జిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి Dr. B.లక్ష్మీనారాయణ అధ్యక్షతన శనివారం భీమవరం అన్ని కోర్టుల ప్రాంగణంలో పెండింగ్ కేసుల పరిష్కారం నిమిత్తం “జాతీయ లోక్ అదాలత్” నిర్వహించారు. కేసుల పరిష్కారం నిమిత్తం నాలుగు బెంచ్ లు ఏర్పాటు చేసారు. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ లో 42 సివిల్ కేసులు, 931 క్రిమినల్ కేసులు, 14 బ్యాంకు, BSNL మొండిబాకీ కేసులు మొత్తం 987 కేసులు రాజీ అయినాయి. రాజీ మొత్తం సుమారు 4 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. న్యాయమూర్తులుగా Dr. B.లక్ష్మీనారాయణ, సివిల్ జడ్జి M.సుధారాణి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి G.సురేష్ బాబు, 1వ అదనపు సివిల్ జడ్జి P.హనీషా వ్యవహరించారు. బెంచ్ కోర్టు మేజిస్ట్రేట్ నాగరాజు, బార్ అధ్యక్షులు యేలేటి యోహాన్ (న్యూటన్), బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *