సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో(bondi) గత ఆదివారం జరుగుతున్నా యూదుల ‘హనూకా’వేడుకలలో వెయ్యి పైగా ప్రజలు ఉత్సహంగా కుటుంబాలుతో గడుపుతుండగా వారిపై ఇద్దరు ముస్లీమ్ ఆగంతకులు గన్స్ తో 7నిముషాలు కాల్పులు జరిపి, మారణహోమం సృష్టించిన ఘటన ప్రపంచాన్ని కుదిపివేసింది. ఈ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఓ ముస్లీమ్ వ్యక్తి ధైర్యంగా ఓ ఉగ్రవాదితో కలబడి తుపాకీ లాక్కున్నాడు. లేదంటే మరింత మంది ప్రాణాలు పోయేవి. అతనికి మీడియా ముఖంగా ఇజ్రాయిల్ ప్రసిడెంట్ నెతన్యాహు సెలూట్ చేసారు. జరిగిన ఘటనపై దోషులను వారి మూలలను సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. పోలీస్ తనిఖీల్లో ఉగ్రవాదులకు చెందిన కారులో ఒక బాంబు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. సీబీఎస్ కథనం ప్రకారం.. ఆ ఉగ్రవాదులను పాకిస్తాన్ మూలాలు ఉన్న తండ్రీ కొడుకులుగా గుర్తించారు. 50 ఏళ్ల సాజిద్ అక్రమ్, 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌లు ఈ దాడికి పాల్పడ్డారు. సాజిద్ పోలీసుల కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు. బ్రతికున్న నవీద్ డేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇచ్చిన ఫొటోలో అతడు పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ధరించే టీషర్ట్‌ను పోలివున్న టీషర్ట్ ధరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *