సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ప్రముఖ వ్యాప్త పట్టణం పాలకొల్లు మునిసిపాలిటీని ఫస్ట్ గ్రేడ్ మునిసిపాలిటీ స్థాయి నుంచి స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి 1965 లోనే ఫస్ట్ గ్రేడు మునిసిపాలిటీగా అవతరించిన పాలకొల్లు పట్టణం ఫస్ట్ గెడు నుండి స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ గా మారడానికి 60 ఏళ్ళు చాల సుదీర్ఘ సమయం పట్టినట్లు భావించాలి. ఇక్కడ నుండే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు MLA గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
