సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వైజాగ్ లో మంచి మనిషి’ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం తొలగింపు ఎంతటి వివాదం రాజేసిందో అందరికి తెలిసిందే. ఐతే ఈసారి.. భీమవరంలో.. స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో, ఎడ్వర్డ్ చెరువును ఆనుకుని, కోర్ట్ కాంప్లెక్స్ కు ఎదురుగా ప్రభుత్వ జీవో అనుమతితో, స్థానిక పోలీస్ వారి అనుమతి, జిల్లా కలెక్టర్ అనుమతితో స్థానిక ప్రముఖులు సమక్షంలో ,ది.12-3-2024 వ తేదీన అభిమానుల భారీ ర్యాలీ తో సూపర్ స్టార్, మాజీ ఎంపీ, పద్మభూషణ్ డా.కృష్ణ విగ్రహాన్ని 16 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసి ఆవిష్కరించటం జరిగింది. దీనికి కృష్ణ గారి సోదరులు ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, తమ్మారెడ్డి భరద్వాజ సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. మరి ఈ విగ్రహాన్ని అకస్మాత్తుగా తొలగించడానికి కుట్ర జరుగుతుందని, దీనిని 24 గంటలలో తొలగించాలని (నేటి బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోగ ) స్థానిక మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇవ్వడంపై .. స్థానిక ప్రముఖ లాయర్, ముచ్చటగా 3 వేరువేరు వార్డుల నుండి 3సార్లు గెల్చిన మాజీ కౌన్సిలర్, సీనియర్ కృష్ణ అభిమాని రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ అభిమానులు అఘమేఘాలతో రాష్ట్ర హైకోర్టు కు అన్ని ఆధారాలతో వెళ్లడంతో నేటి మధ్యాహ్నం విగ్రహం తొలగింపు ఫై కోర్ట్ స్టే ఇచ్చింది .. గతంలో ఈ విగ్రహ ఏర్పాటుకు 7 నెలల నిరీక్షణ తరువాత మునిసిపల్ అనుమతి ఇచ్చారని , దాల్మియా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు గ్రౌండ్ పై యిచ్చిన మార్కింగ్ తో కృష్ణ విగ్రహం షెడ్డు తో, కరెంట్ సర్వీస్ లైటింగ్ తో సహా సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశామని, దీనికి , కలెక్టర్ గారి అద్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ 14 డిపార్ట్మెంట్ జిల్లాస్థాయి అధికారులతో NOC ఆమోదం ఉంటె.. ఇప్పుడు మునిసిపల్ నోటీసు ఇవ్వడం వెనుక కుట్ర ఉందని కృష్ణ అభిమానులు భావిస్తున్నారు.. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *