సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం ఎడ్వార్డ్ ట్యాంక్ వద్ద కృష్ణ కాంశ్య విగ్రహం వద్ద పలువురు హీరోల అభిమాన సంఘాల నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా భీమవరంలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని తొలగించాలనే ప్రయత్నాలు సరికాదని, ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చిందని, .. ఎవరికొ మేలు చెయ్యాలని కుట్రతో మునిసిపల్ అధికారులు ఈ తొలగింపు కార్యక్రమానికి పూనుకొంటే భీమవరం లో కృష్ణ, మహేష్ అభిమానులతో పాటు ప్రభాస్, చిరంజీవి, రాంచరణ్ , బాలకృష్ణ నాగార్జున, వెంకటేష్ , మోహన్ బాబు అభిమానులు కూడా ఏకమై ఆందోళనకు, నిరసనలకు సిద్ధంగా ఉన్నామని ఆయా అభిమాన సంఘాల నేతలు హెచ్చరించారు. తదుపరి, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అభిమానుల నిరసనలు ఉంటాయని,అన్నారు. అన్ని అనుమతులతోనే కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 2 ఏళ్లుగా ఈ విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలతోపాటు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. కృష్ణ విగ్రహం ఎటువంటి ఆక్రమణలు , టాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపట్టారని తెలుగు సినిమా స్థాయి పెంచినకృష్ణ’ అంటే అందరూ హీరోల అభిమానులు అభిమానించే నటులని, అయన విగ్రహావిష్కరణకు అందరూ అభిమానులు హాజరైయ్యారని, అటువంటి మహనీయుని విగ్రహాన్ని తొలగించాలని ప్రయత్నాలు సహించం అన్నారు.. ఈ కార్యక్రమంలో కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ రాయప్రోలు శ్రీనివాస్ మూర్తి, బీహెచ్ సుబ్బరాజు, గంట్ల ప్రసాద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చల్లా రాము, కొప్పర్తి కోటి, బాలకృష్ణ, ఎన్టిఆర్ ఫ్యాన్స్ చిరుకూరి రామకృష్ణ చౌదరి, పడమటి సోమేశ్వరరావు, కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ వెంకటేశ్వరరాజు, ఉండి వాసు, నాగార్జున, వెంకటేష్ ఫ్యాన్స్ ఎల్ డి ప్రసాద్, కడలి సుబహ్మణ్యం, శోభన్ బాబు ఫ్యాన్స్ భట్టిప్రోలు శ్రీనివాసరావు, మోహన్ బాబు ఫ్యాన్స్ వాసు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *