సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో.. అమరజీవి జలధార జల జీవన మిషన్ వాటర్ గ్రిడ్ పథకం పనులకు పెరవలిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. కేంద్రం మన గోదావరి జిల్లాల అభివృద్ధికి ఎప్పుడు ముందుంటుందని. అందరికి మంచినీరు అందించాలనే లక్ష్యంతోనే ప్రధాని మోడీ సూచనతో కేంద్ర నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ద్వారా నీటి కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి బహిరంగ వేదికపై పవన్ మాట్లాడుతూ.. ఈ రాష్ట్రానికి మంచి స్పందన జరగాలనే నేను తగ్గి, కూటమితో కలిశాను‘ ‘అక్వా కల్చర్ వలన భూగర్భ జలాలు కలుషితమయ్యాయంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. రూ.7,500 కోట్లతో స్వచ్ఛమైన తాగునీరు రాష్ట్రంలో అందరికీ అందిచాలని నిర్ణయించాం అన్నారు. ప్రతిపక్ష వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు. మీ దౌర్జన్యాలకు భయపడలేదు. మరల మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైలులో వేస్తామంటున్నారు. వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అటువంటి రౌడీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా.. కాలికి కాలు, చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తే.. వారంతా కకావికలం అయిపోతారు. పాత పద్ధతిలోనే మేముంటామని వైసీపీ నేతలు అంటే.. నేను విసిగిపోయాను. అలాంటి వారి ప్రాణాలకు గ్యారంటీ లేదు. అడ్డగోలుగా వెళతామంటే.. రోమం రోమం తీసేసి కూర్చోబెడతాం అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *