సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం సాయంత్రం భీమవరం నరసయ్య అగ్రహారంలో సుమారు 5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంటు రోడ్డు, సెంటర్ లైటింగ్, డివైడర్, డ్రైనేజీ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా పరిశీలించారు. 5వ వార్డు కుముడవల్లి రోడ్డు నుండి ఆర్టీసీ డిపో అవుట్ గేట్ వరకు జరుగుతున్న ఈ నిర్మాణ పనులను పరిశీలించి మున్సిపల్ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 330 మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, మరో రెండు వందల మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మించవలసి ఉందని అధికారులు తెలిపారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మిగిలిన సిమెంట్ రోడ్ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.. ఈ పనుల పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ రహీం, ఏ ఈ రవితేజ,బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు, తదితరులు పాల్గొన్నారు.
