సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చలిపులి పంజా విసురుతుంది. ఏపీలోని గోదావరి జిల్లాలలో భీమవరం, ఏలూరు, కాకినాడ,కోనసీమ చాలా ప్రాంతాల్లో 8 -6 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉత్తరాంద్ర లోని ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3 – 2 కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాయలసీమలో కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. చలి వాతావరణం కారణంగా ప్రజలు ఫ్లూ జ్వరాలు, వళ్ళు నొప్పులు వైరస్ సమస్యలతో ఆసుపత్రుల వద్ద క్యూలు కడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *