సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్‌లో విక్రయిస్తున్న గుడ్లలో క్యాన్సర్ ముప్పునకు కారణమయ్యే నైట్రోఫ్యురాన్ మెటబాలైట్స్ ఉంటున్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎఫ్‌ఎస్ఎస్ఏఐ తాజగా ఒక ప్రకటన విడుదల చేసింది. బాహ్య గరిష్ఠ అవశేష పరిమితి (EMRL)కి లోబడి కనీస స్థాయిలో నైట్రోఫ్యురాన్ మెటబాలైట్స్ ఉండడం సాధారణ విషయమేనని, దాంతో ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని, ప్రజలు బేషుగ్గా గుడ్డు (eggs) తినవచ్చునని ప్రకటించింది. అయితే గుడ్డు ధరలు మరోసారి పెరిగాయి. భీమవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నేడు, ఆదివారం 30 గుడ్ల హోల్ సేల్ ధర 210 రూపాయలకు చేరుకొంది. దాదాపు కేజీ స్కీన్ లెస్ చికెన్ ధర తో ( 230) ఇది సమానం కావడం విశేషం. న్యూ ఇయర్ కి గుడ్డు ధర మరింత పెరగవచ్చు..
