సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం రెస్ట్ హౌస్ రోడ్డు చివరలో స్థానిక 27వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ విజ్జురోతు రాఘవకుమారి గత శుక్రవారం గుండెపోటుతో మరణించారు. దానితో ఆమె భర్త, టీడీపీ సీనియర్ నేత, మాజీ కౌన్సిలర్ విజ్జురోతు రాఘవులను వారి కుటుంబ సభ్యులను రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పరామర్శించి వారికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. ఆయన ముందుగా రాఘవ కుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం గా మిత్రులు విజ్జురోతి రాఘవులు కుటుంబానికి సిగ్మా న్యూస్ తరపున తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాము.
