సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం పల్స్ పొలియా కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరం నరసయ్య అగ్రహారంలో ఉదయం చిన్నారులకు చుక్కల మందు వేసి ప్రారంభించారు. ఇక, ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మోడీ సుపరిపాలన యాత్ర రేపు సోమవారం ఉదయం భీమవరం చేరుకుంటుందని, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్రకు భీమవరం విసాకోడేరు వంతెన వద్ద ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసామని, బహిరంగ సభ జిల్లా బిజెపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తెలిపారు. ముఖ్యఅతిథిలుగా కేంద్రమంత్రులు , కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రకాశం చౌక్ మీదుగా ఉండి బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహం వద్దకు చేరుకుంటారని తెలిపారు..విగ్రహ ఏర్పాటు, సభ జరిగే ప్రాంతాన్ని నేడు ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ , జిల్లా బిజెపి నాయకులతో కలిసి పరిశీలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *