సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ఎన్నో ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తీ కావడంతో మరిన్ని రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడ నుంచి భీమవరం టౌన్ మీదుగా మైసూర్ మధ్య ప్రత్యేక వీక్లీ రైలును రైల్వేశాఖ ప్రకించింది. ఈ రైలు(07033) జనవరి 16 నుంచి 31 మధ్య సర్వీసులు అందించనుంది. ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. ఈ రైలు ఉదయం 9 గంటలకు కాకినాడలో బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 12 గంటలకు మైసూర్ చేరుకుటుంది.భీమవరం, తణుకు ,రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, అనంతపురం, బెంగళూరు మీదుగా మైసూర్‌కు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో మైసూర్‌లో 17.20 గంటలకు బయల్దేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *