సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొద్దీ నెలలు క్రితం భీమవరంలో పేకాట క్లబ్ ల వ్యవహారంలో, సివిల్ వ్యవహారాలలో అవినీతి చేస్తున్నారని తనకు పిర్యాదులు వచ్చాయని, డీఎస్పీ జయసూర్య ఫై నివేదిక కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా.. జిల్లా ఎస్పీ అద్నాన్ అస్మి కి ఆదేశాలు ఇవ్వడం.. తదుపరి దీనిపై ఉండి ఎమ్మెల్యే, , అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు తనకున్న సమాచారం మేరకు భీమవరం డీఎస్పీ జయసూర్యకు ‘మంచి ట్రాక్ రికార్డు’ ఉందని సమర్థుడైన అధికారి అని పేర్కొనడం దానిని సమర్ధిస్తూ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మీడియా లో మాట్లాడటం.. రాష్ట్ర రాజకీయాలలో గత కొద్దీ నెలలు క్రితం పెను సంచలనం రేపింది. అయితే అదే సమయంలో కేంద్ర హోమ్ శాఖ ఏపీలో ఉత్తమ పోలీస్ అధికారిగా ఢిల్లీలో భీమవరం డీఎస్పీ జయసూర్య కి అవార్డు అందివ్వడంతో ఒక్కసారిగా ఈవ్యవహారం సర్దుమణిగిపోయింది. అయితే విచిత్రంగా నేడు, గురువారం మధ్యాహ్నం డిఎస్పీ జయసూర్యకు మంగళగిరి లోని పోలీస్ హెడ్ క్వాటర్స్ కు బదిలీ అయ్యినట్లు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. భీమవరం నూతన డిఎస్పీ గా ‘రఘువీరా విష్ణు‘ నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
