సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు, శుక్రవారం తెలంగాణ భవన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. . ఎన్నికల ప్రచారం వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, ప్రియాంక గాంధీ మీద ఒట్టు పెట్టి హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగవేశారని మండిపడ్డారు. నెలకు రూ.2, 500 ఇవ్వడానికి ముఖం లేదు కానీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.తాము . బీఆర్ఎస్‌కు అండగా నిలుస్తున్న హైదరాబాద్ వాసులకు పాదాభివందనం చేసినా తప్పులేదని పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి తన తండ్రి కెసిఆర్ ని చెత్త బాషా లో తిడుతున్నందుకు తనకు చాలా కోపంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి నేను ఆంధ్రాలో గుంటూరు లో చదువు కోవడం ఫై విమర్శిస్తున్నారని, మరి నేను గుంటూరులో చదివితే తప్పేమిటని ?ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి లాగా చదువు లేకుండా తిరగలేదన్నారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు అట కానీ ఆయన భీమవరం వెళ్లి ఆంధ్రా అల్లుడిని తెచ్చుకున్నారంటూ.. మరి రేవంత్ రెడ్డిని భీమవరం బుల్లోడు అనాలా? అంటూ వ్యగ్యంగా ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *