సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలో నెంబర్1 హిట్ సినిమాగా సుమారు 2వేల కోట్ల కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించిన పుష్ప 2 సినిమా.. ఐకాన్ హీరో అల్లు అర్జున్ ను ఇంకా హైదరాబాద్ సంధ్య థియేటర్ విషాదం కేసు వదలడంలేదు. రాజకీయ నేతల మీటింగ్ లో కార్యక్రమాలలో ఎందరో అమాయకులు మరణిస్తుంటారు. కానీ వారిని ఇలా ఏ కేసులు వెంటాడవు.. అయితే తాజగా విషయంలోకి వస్తే.. అప్పటి సంధ్య థియేటర్స్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు తాజగా నేడు, శనివారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అందులో పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా.. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గాపోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. అల్లు అర్జున్ కు చెందిన 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. 2024 లో పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్లు పడ్డాయి. ప్రీమియర్ షో చూడ్డానికి హైదరాబాద్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ తొక్కిసలాట కేసుకు సంబంధించి గతంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.2రోజులు జైలులో కూడా ఉన్నారు. గాయపడిన బాలుడు శ్రీ తేజ్ ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం గతంలో అల్లు అర్జున్, అల్లు అరవింద్ 75 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. భాస్కర్ కుటుంబాన్ని ఆదుకోవటానికి 2 కోట్ల రూపాయలు అకౌంట్‌లో డిపాజిట్ వేశారని నిర్మాత దిల్ రాజు గతంలో తెలిపారు. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *