సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా విభాగంలో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేడు, శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 60 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్, ఫీమేల్ నర్సింగ్, స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 31, 2025వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుల సంఖ్య: 19 ఫీమేల్ నర్సింగ్ పోస్టుల సంఖ్య: 16, స్టేషనరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టుల సంఖ్య: 10, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల సంఖ్య: 01 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల సంఖ్య: 04,లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టుల సంఖ్య: 10, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎంఎల్టీ, బీఎస్సీలో ఉత్తీర్ణతత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా డిసెంబర్ 31, 2025వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నింపిన దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌లో సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.32,670 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తులు సమర్పించవల్సిన చిరునామా: ..Office of the District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam, Krishna district.
